17 March, 2026 | 12:23 AM

Breaking News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన   •   ఎమ్మెల్యే ఆఫీస్ పక్కనే అక్రమ కట్టడాలా?   •   9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •  

రామగిరిఖిల్లా ఔషద మొక్కలపై చేసిన పరిశోధన పత్రం మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

05-11-2024 04:17 PM

మంథని(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును శాతవాహన విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరసింహమూర్తి హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి రామగిరిఖిల్లా పైన ఉన్న ఔషద మొక్కలపై ప్రాథమిక పరిశోధన చేసి అ పత్రాన్ని మంగళవారం మంత్రి శ్రీధర్ బాబుకు అందజేశారు. ఆయనతో పాటు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరేళ్లి కిరణ్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

రామగిరిఖిల్లా కొండలపై విస్తరించి ఉన్న ఔషధ మొక్కలు, వృక్ష వైవిధ్యాన్ని గురించి చేసిన ప్రాథమిక పరిశోధనా పత్రాన్ని అంతర్జాతీయ పరిశోధన పత్రికలో ప్రచురించడం జరిగిందని ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరసింహమూర్తి మంత్రి శ్రీధర్ బాబుకు తెలిపారు. దాదాపుగా 300 పైచిలుకు ఔషధ మొక్కలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలోనే మరింత పరిశోధన జరిపి రామగిరిఖిల్లా ఔషధ మొక్కల గురించిన సమగ్ర సమాచారాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్నేహితులు శ్రీధర్ బాబును కలిసి మరిన్ని పరిశోధనల కొరకు ప్రోత్సహం ఇవ్వాలని కోరారు. మంత్రి ఆ నివేదికను పరిశీలించి సానుకూలంగా స్పందించారు.