16 March, 2026 | 11:05 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

దేవస్థానం అభివృద్ధికి కృషి..

05-11-2024 04:06 PM

మున్సిపల్ చైర్ పర్సన్ గందె  రాధిక శ్రీనివాస్

హుజురాబాద్ (విజయక్రాంతి): పోచమ్మ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని పోచమ్మ దేవాలయంలో మంగళవారం అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో ఏకైక పోచమ్మ దేవాలయం అని దేవాలయ అభివృద్ధికి పాలకవర్గ సహకారంతో కృషి చేస్తానని అన్నారు. నాన్ ప్లాన్ గ్రాంట్ నిధుల నుండి  రూపాయలు నాలుగు లక్షలతో దేవస్థానంలోని గర్భగుడి ప్రాంగణంలో సీసీ ప్లాట్ఫారం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ 4, 5 వార్డు కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజులను ఆలయ కమిటీ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏ ఈ సాంబరాజు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు కొలిపాక రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ భూమ్ చంటి, భూమ్ రాము, పంజాల సమ్మయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.