10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

అవయవ దానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు స్ఫూర్తిదాయకులు

09-10-2025 04:45 PM

సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్..

గోదావరిఖని (విజయక్రాంతి): అవయవ దానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు స్ఫూర్తిదాయకులని సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని సీమ్స్ కాలేజీలో నిర్వహించిన సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, శరీర దానం చేసిన కుటుంబాలను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా విలువలను నిలబెట్టే ఈ రకాల సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమైనవి. అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు, వారి కుటుంబాలు స్ఫూర్తిదాయకులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.