09-10-2025 04:46:57 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమీని గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెరాస ముఖ్యకార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో కుశ్నపల్లి ఎంపీటీసీ సభ్యులుగా తెరాస బలపరిచిన మాజీ ఎంపీటీసీ లంగారి శ్రీనివాస్ ని అధ్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను బలంగా తీసుకెళ్లి అభ్యర్థి గెలుపుకై అందరు ఏకమావ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుశ్నపల్లి తాజా మాజీ ఎంపీటీసీ ఆత్రం సాయి, సుస్మీర్ మాజీ సర్పంచ్ శంకర్, అమీరుద్దీన్, చెంద్రశేఖర్, అనిల్, శ్రీనివాస్, సీతారామ్,మల్లాజీ, అశోక్, గణేష్, పురుషోత్తం, అక్సంతారావు,చెంద్రయ్య మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.