22 August, 2026 | 1:43 AM

రామప్ప డిఫెన్స్ అండ్ జూనియర్ కాలేజీ హవా

22-08-2026 12:34 AM

జావెలిన్ త్రో విభాగంలో విద్యార్థుల సత్తా

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

హన్మకొండ, ఆగస్టు 21 (విజయక్రాంతి): హన్మకొండ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జవహర్‌లాల్ నెహ్రూ స్టేడి యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో రామ ప్ప డిఫెన్స్ అండ్ జూనియర్ కాలేజీకి చెం దిన విద్యార్థులు పాల్గొన్నారు. జావెలిన్ త్రో విభాగంలో కె. రిత్విక జిల్లా స్థాయి ప్రథమ స్థానం, బి. విష్ణుప్రియ జిల్లా స్థాయి ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎం పికయ్యారు. అదేవిధంగా ఎల్. జోష్ణ 600 మీటర్లు, 60 మీటర్ల రన్నింగ్ పోటీల్లో జిల్లా స్థాయి ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

  ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి లౌడియా అభిషేక్ 100 మీటర్స్ మొదటి స్థానం, 200 మీటర్స్ తృతీయ స్థానం, 300 మీటర్స్ రెండవ స్థానం లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతలను రామ ప్ప డిఫెన్స్ అండ్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ ఐలీ కర్ణాకర్ ఘనంగా సత్కరించి, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధాన కోచ్ కమల్‌ని ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో అకాడమిక్ ప్రిన్సిపాల్ వినోద్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, జోనల్ మేనేజర్ పూర్ణ చందర్, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల విజయానికి కృ షి చేసిన కోచ్‌లు, అధ్యాపకులను కూడా అభినందించారు.