22 August, 2026 | 5:06 AM

మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతపూజలు

22-08-2026 12:36 AM

కొత్తపల్లి, ఆగస్టు21(విజయక్రాంతి): మహాశక్తి దేవాలయం’ వరలక్ష్మీ వ్రత వేడుకలతో జనసంద్రంగా మారింది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పూజ భక్తిశ్రద్ధలు, సంప్రదాయ వైభవం మధ్య ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. వరలక్ష్మీ వ్రత వేడుకలను పురస్కరించుకుని ఉదయం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, ఘనంగా మహా హారతి నిర్వహించారు.సాయంత్రం ప్రధాన వేడుకగా వరలక్ష్మీ వ్రతము, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను అత్యంత భక్తిప్రపత్తులతో చేపట్టారు.

పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో ఈ పవిత్ర వేడుకలను దేవాలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

దేవాలయ ప్రాంగణాన్ని ఆకర్షణీయమైన పూల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహాశక్తి దేవాలయంలో కొలువైన మహాలక్ష్మి అమ్మవారు భక్తుల పాలిట ’కొంగు బంగారం’గా విరాజిల్లుతున్నారు. ఇక్కడ వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఇంటా సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.