రామాయణ విడుదల ఖరారు
భారతీయ ఇతీహాస గాథ రామాయణాన్ని బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ మరోమారు తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ పేరుతో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో యష్ నటిస్తున్న్నారు. ఈ పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది.
నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ఎపిక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని నవంబర్ 6న పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేకంగా ఐమాక్స్, ఇతర ప్రీమియం ఫార్మాట్లలో రానున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ పాటలు, హన్స్ జిమ్మర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.






