పొడవుగా ఉండే హీరోల విషయంలో ఆ అభిప్రాయం సరైనది కాదు!
వరుణ్‌తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సం దర్భంగా హీరో వరుణ్‌తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్రతి నటుడిలాగే నాకూ వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది.
ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలూ చేశా. కోవిడ్ తర్వాత ఎక్కువగా సీరియస్, భారీ యాక్షన్ వచ్చాయి. ఎప్పటినుంచో ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయాలనుంది. గాంధీ ఈ కథ చెప్పినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నా. ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘కొరియన్ కనకరాజు’ చేశా. నటుడు అనే వాడు అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను చేస్తా. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అభిప్రాయం ఉంది.
అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. ‘కొరియన్ కనకరాజు’లో కామెడీతోపాటు యాక్షన్ కూడా బాగా కుదిరింది. మా నాన్నతో కలిసి నటించాల ని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ‘బరి’తో అది నెరవేరుతోంది. ఇందులో నాన్న కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా -ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది. చిన్నప్పుడు వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్‌డ్రాప్‌ప్‌లో వచ్చిన కథ అది.






