calender_icon.png 2 July, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాయణ టైటిల్ గ్లింప్స్ సిద్ధం

02-07-2025 12:00:00 AM

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రామాయణ’. ఇందులో యశ్ రావణుడిగా, సన్నీడియోల్ హనుమంతుడిగా, లారాదత్తా కైకేయిగా, రకుల్‌ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రల్లో కనిపించనున్నారు. కొందరు బాలీవుడ్ నిర్మాతలతోపాటు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రెండు భాగాల్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలిభాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నా హాలు చేస్తున్నారని కొన్ని వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. జూలై 3న టైటిల్ గ్లింప్స్ విడుదల కానున్నట్టు సమాచారం.

బెంగళూరులో భారీ ఎత్తు న నిర్వహించే ఈవెంట్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో తారలంతా అక్కడికి బయల్దేరుతున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్ అయ్యాయి. ఈ సినిమా పార్ట్1 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.