01-07-2025 07:06:26 PM
‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు
నితిన్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి లయ మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు హైదరాబాద్‌లో ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ మాట్లాడుతూ.. “తమ్ముడు’ చిత్రం కోసం శ్రీరామ్‌వేణు ఎంత కష్టపడ్డాడో జూలై 4న మాట్లాడతా. నా గత సినిమాలు నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్‌తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా. నా కో స్టార్స్ 80 రోజులు ఫారెస్ట్‌లో షూటింగ్ చేశారు. అందులో సగం నైట్ షూట్స్, సగం డే షూట్స్ ఉంటాయి. అడవిలో జ్వరం వచ్చినా, ఫుడ్ పాయిజన్ అయినా, గాయాలైనా ఓర్చుకుని నటించారు. ఉదయం 7 గంటలకు షూట్ అంటే సెట్‌లో టైమ్‌కు ఉండేవారు. వీళ్లు లేకుంటే సినిమా కంప్లీట్ అయ్యేది కాదు. నేను కొంచెం దిగులుగా ఉంటే నిర్మాతలు రాజు, శిరీష్ నాకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడేవారు. ఇది థియేట్రికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే సినిమా” అన్నారు.
డైరెక్టర్ శ్రీరామ్‌వేణు మాట్లాడుతూ... “ప్రొడ్యూసర్స్ రాజు, శిరీష్ నాకు కుటుంబసభ్యుల్లాంటి వాళ్లు. నాకంటే ఈ సినిమాను ఎక్కువగా నమ్మిన వ్యక్తి శిరీష్. ఈ సినిమాను ఇలా థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశానని చెప్పినప్పుడు ప్రొడ్యూసర్స్‌గా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. దిల్ రాజు బిజీ వల్ల మాకు టైమ్ కేటాయించకున్నా శిరీష్ మా యోగక్షేమాలు కనుక్కునేవారు. వాళ్లు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా. హీరో నితిన్ ఈ సినిమా కోసం ప్రతి విషయంలో అన్ కండీషనల్‌గా సపోర్ట్ చేశారు. నేను అనుకున్న క్యారెక్టర్‌ను ఎంతో బాగా పర్‌ఫార్మ్ చేశాడు. మా పాప దిత్య ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్‌లో నా వైఫ్, పాప నాతోనే ఉన్నారు.
షూటింగ్ టైమ్‌లో ఫ్యామిలీ మన దగ్గరే ఉంటే ఎంత సపోర్ట్ వస్తుందో నేను ఈ సినిమాకు ఎక్సిపీరియన్స్ చేశాను. ఈ మూవీలో ప్రేక్షకులు కొత్త లయను చూస్తారు. వర్ష నాకు కూతురు లాంటిది.. ఈ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. ఈ మూవీ కోసం మెయిన్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఒక విద్య నేర్చుకున్నారు. ఈ సినిమాలో కీ రోల్స్ అన్నింటికీ యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ సినిమాలోని ఫ్యామిలీ ఫిల్లర్ లాంటిది. వాళ్లమీదే ఎమోషన్ క్యారీ అవుతుంటుంది. డీవోపీలుగా చేసిన సేతు, సమీర్‌రెడ్డి, గుహన్ బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సీన్స్ చూసి తను బాగా కనెక్ట్ అయ్యి బెటర్‌మెంట్ కోసం రెండుసార్లు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. జూలై 4 తర్వాత ‘తమ్ముడు’ సినిమా గురించి మాట్లాడుతా” అని చెప్పారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “తమ్ముడు’ మూవీ ఔట్ పుట్ ఇంత బాగా రావడానికి టెక్నీషియన్స్ కష్టమే కారణం.. వీళ్లంతా శ్రీరామ్ వేణు విజన్‌ను స్క్రీన్ మీదకు అద్భుతంగా తీసుకొచ్చారు. జై బగళాముఖీ పాటతో మా సినిమాకు ఒక వైబ్ వచ్చింది. అజనీష్ లోకనాథ్ తన మ్యూజిక్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. మాతో శ్రీరామ్ వేణు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడు. మా దగ్గర ‘ఎంసీఏ’, ‘వకీల్ సాబ్’ లాంటి సూపర్ హిట్స్ చేశాడు. ఆ సినిమాలకు మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకున్నాడేమో గానీ ‘తమ్ముడు’కు మాత్రం తను ఒంటరిగానే కష్టపడ్డాడు. ఈ చిత్రం సాధించబోయే సక్సెస్ క్రెడిట్ శ్రీరామ్ వేణుదే.
ఐదుగురు ఉమెన్స్ స్ట్రాంగ్ రోల్స్ చేశారు. వీళ్ల క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. నితిన్‌తోపాటు ఈ ఐదుగురినీ హీరోలుగా అనౌన్స్ చేయొచ్చు. అంత బాగా పర్‌ఫార్మ్ చేశారు. నితిన్ గత కొన్ని చిత్రాలు సక్సెస్ కాలేదని బాధలో ఉన్నాడు. కానీ ‘తమ్ముడు’ ఆయనకు కమ్‌బ్యాక్ చిత్రం అవుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ‘తమ్ముడు’ మా బ్యానర్‌కు మరో హిట్ ఇవ్వబోతోంది. రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ చేశాం.. సూపర్ హిట్ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే రామ్‌చరణ్‌తో ఓ సూపర్‌హిట్ మూవీ చేయబోతున్నాం. త్వరలో ఆ ప్రాజెక్ట్ ప్రకటిస్తాం” అని తెలిపారు.
నిర్మాత శిరీష్ మాట్లాడుతూ... “తమ్ముడు’ సినిమా జూలై 4న సాధించబోయే సక్సెస్ క్రెడిట్ మొత్తం శ్రీరామ్‌వేణుకే దక్కాలి. నితిన్ కెరీర్‌లో ‘జయం’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సక్సెస్‌కు ఎంత సంతోషపడ్డాడో ‘తమ్ముడు’ విజయం అంతకు రెట్టింపు ఆనందాన్నిస్తుంది. ప్రొడ్యూసర్స్‌గా మేము నితిన్‌కు ఆ ప్రామిస్ ఇస్తున్నాం” అన్నారు.
నటి లయ మాట్లాడుతూ... “ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా చేయలేదు. నా పర్సనల్ లైఫ్‌లో కూడా ఇలాంటి ఎమోషన్స్ ఎక్సిపీరియన్స్ చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను సింగిల్ చైల్డ్‌ను. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరూ లేరు. ఈ సినిమా కోసం 2 ఏళ్లు అయ్యిందని అంటున్నారు. పదేళ్లు టైమ్ పట్టినా ఇలాంటి మంచి సినిమా పనిచేస్తాం. నా గత చిత్రాలు చూసి నన్ను ప్రేక్షకులు ఎంతగా అభిమానించారో, అదే ప్రేమను ‘తమ్ముడు’ సినిమా మీద చూపిస్తారని కోరుకుంటున్నా” అని చెప్పారు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ... “తమ్ముడు’ మూవీలో నేను నటించగలనని నాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా డైరెక్టర్. ఈ పొట్టిపిల్ల ఏం చేస్తుందని అనుకోకుండా నాకు ఈ అవకాశమిచ్చారు. ఏ మేకప్ లేకుండా ఫ్లుటై దిగి డైరెక్టర్ శ్రీరామ్ ఆఫీస్‌కు వెళ్లా. నన్ను చూసి ఇలా ఓకే అని క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేశారు. హీరో నితిన్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఎన్నో జోక్స్ చెప్పి ఆయనను విసిగించాను. దిల్ రాజు ఇటీవల ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే ప్లాట్‌ఫామ్ అనౌన్స్ చేశారు. లక్షలాది మందికి ఆ వేదిక నమ్మకాన్నిస్తుందని ఆశిస్తున్నా. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు మా కంటే టెక్నీషియన్స్ ఎక్కువ శ్రమించారు.. వారికి థ్యాంక్స్. మనం కొన్ని సినిమాలు థియేటర్స్‌లో మిస్సయితే బాధపడతాం.. అలా థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమానే ఈ ‘తమ్ముడు” అన్నారు.
హీరోయిన్ సప్తమిగౌడ మాట్లాడుతూ... “ఈ సినిమాలో రత్న క్యారెక్టర్‌లో నేను బాగా నటించేందుకు డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. హీరో నితిన్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది” అని తెలిపారు. ఇంకా ఈ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డీవోపీ కేవీ గుహన్, నటీనటులు హరితేజ, బేబి దిత్య, గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడి తమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్నారు. చిత్రబృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.