02-07-2025 12:00:00 AM
హాస్యచిత్రాలతోపాటు వైవిధ్యభరితమైన కథలతో తెలుగు చిత్రసీమలో నటుడిగా తనదైన ముద్ర వేశారు అల్లరి నరేశ్. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారీ అల్లరోడు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచనాదర్శక త్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశా రు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో కథానాయకుడు అల్లరి నరేశ్ ఆల్కహాల్‌లో మునిగిపోయిన దృశ్యం ఆలోచింపజేసేలా ఉంది. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. రుహానిశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గిబ్రాన్; ఛాయాగ్రహణం: జిజు సన్నీ; కూర్పు: నిరంజన్ దేవరమానే; కళా దర్శకుడు: విశాల్ అబానీ.