ముగిసిన ఆర్‌ఏఎంపీ నైపుణ్యాభివృద్ధి కార్య క్రమం
స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 15(విజయక్రాంతి): అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాల (మహిళల కోసం)లో ఏఐసీ ఏఎల్‌ఈఏపీ డబ్ల్యూఈహెచ్‌యూబీ,కళాశాల సం యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 15 రోజుల ఆర్‌ఏఎంపీ (రైజింగ్, ఎక్సీలెటరింగ్ ఎంఎస్‌ఎంఈ పర్‌ఫార్మరెన్స్) నైపుణ్యాభివృద్ధి కార్య క్రమం (స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎప్‌డీపీ) విద్యార్థుల ఐడియా పిచింగ్ సెషన్, వాలెడిక్టరీ కార్యక్రమంతో విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలు, విద్యా సంవత్సరాలకు చెందిన 32 మంది విద్యార్థులు పాల్గొని 22 వినూత్న ప్రాజెక్ట్ ఆలోచనలను ప్రదర్శించారు. ఈ ఆలోచనలు క్లీన్ టెక్, మెడ్ టెక్, హెల్త్ టెక్, బయో టెక్, ఫుడ్ టెక్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రి టెక్, ఎడ్ టెక్, ఫిన్ టెక్, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, సామాజిక ఆవిష్కరణలు వంటి సుమారు 12 రంగాలను కవర్ చేశాయి. చివరి ఐడియా పిచింగ్ సెషన్స్‌కు న్యాయనిర్ణేతలుగా డాక్టర్ జహూరు ల్లాహ ఎస్‌ఎండీ, డాక్టర్ కె.రవి కిషోర్, డాక్టర్ విజేందర్ సోలంకితో పాటు స్టాన్లీ కళాశాల అంతర్గత జ్యూరీ సభ్యులు వ్యవహరించారు. కాగా విద్యార్థుల వినూత్నత, సాధ్యాసాధ్యా లు, వ్యవస్థాపక సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ 10 ప్రదర్శనలను జ్యూరీ ఎంపిక చేసింది.
అనంతరం నిర్వహించిన వాలెడిక్టరీ, సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా ఏఎల్‌ఈఏపీ కార్యదర్శి పద్మజ ప్రభాకర్, ఎంఎస్‌ఎంఈ జాయింట్ డైరెక్టర్ మధుకర్ బాబు, తెలంగాణ ప్రభుత్వం పాల్గొన్నారు. ఈ కార్యక్ర మం కరస్పాండెంట్ కె.కృష్ణారావు, డైరెక్టర్(మేనేజ్‌మెంట్) టీ రాకేష్‌రెడ్డి, డైరెక్టర్ (మే నే జ్‌మెంట్) అండ్ ప్రెసిడెంట్ ఆర్. ప్రదీప్‌రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించారు. పర్యవేక్షకులుగా ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ రాజు, డీ న్(అకాడెమిక్స్) డాక్టర్ ఎ.వి నయ్‌బాబు, డీన్ ఇన్నోవెషన్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్(డీఐపీఏ) డాక్టర్ సత్యప్రసాద్, అడ్మి నిస్రే టివ్ ఆఫీసర్ ఆకుల రమేష్, కన్వీనర్లుగా సీఎస్‌ఈఏఐఎంఎల్ హెచ్‌వో డాక్టర్ జి. శ్రీలత, ఏఐ అండ్ డీఎస్ హెచ్‌వోడీ డాక్టర్ కె.వైదే హి, ప్యాకల్టీ కోఆర్డినేటర్‌గా లావణ్య మారెళ్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏఐ అండ్ డీఎస్ సీఎంఈ అండ్ ఈఈ ఈ వ్యవహరించారు.






