8 May, 2026 | 4:21 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

విచ్చలవిడిగా వాగుల్లో నుండి ఇసుక దోపిడీ

08-05-2026 03:20 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలో వాగులు ఎండిపోవడంతో ఇసుక దోపిడీ యదేచ్చగా కొనసాగు తున్నది. రాత్రిపూట మొరం తవ్వకాలు పగలు మారుమూల గ్రామాల లాగుల్లో నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. సహజ వనరులతోపిడితో భవిష్యత్తులో ఎత్తైన గుట్టలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మండలంలోని కరత్వాడ పిప్పల్ దరి, టివి టి సోనాల గ్రామం సమీపంలోని అటవీ సమీప చేలలోనుండి విచ్చలవిడిగా మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి.

అయితే మొరం మాఫియా ఊరు రా తమ ప్రాబల్యాన్ని అడ్డుపెట్టి నిరాటకంగా మొరం తవ్వకాలను కొనసాగిస్తున్నారు. కొంతమంది జెసిబి ఓనర్లు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్న అధికార యంత్రంగానికి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల సమీపంలోని వాగుల్లోని ఇసుక తవ్వకాలు కొనసాగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు ఈ విషయంలో తగు చొరవ చూపించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.