18 April, 2026 | 11:04 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పొట్టేళ్లు అ‘ధర’హో

07-06-2025 12:02 AM

-బక్రీద్ నేపథ్యంలో భారీ డిమాండ్

=రూ.50 వేల నుంచి లక్ష వరకు ధరలు

కార్వాన్, జూన్ 5: బక్రీద్ నేపథ్యంలో పొట్టేళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. పొట్టేళ్ల సైజునుబట్టి సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలు పలుకుతున్నాయి.  మెహదీపట్నం, టోలిచౌకి, నానల్నగర్, రేతిబౌలి, జియాగూడ ప్రాంతాల్లో మేకలు, పొటేళ్ల విక్రయాలు జోరు అందుకున్నాయి.

వ్యాపారులు వివిధ ప్రాంతాల్లో కొని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొన్ని పొడవైన మేక పోతులు ఒక్కోటి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. శనివారం బక్రీద్ కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు భారీగా తరలివచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మేక పొట్టేళ్లు కూడా వివిధ రకాలవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.