1 July, 2026 | 6:44 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

ఖైరతాబాద్ గణపతి ఏర్పాటుకు కర్రపూజ

07-06-2025 12:03 AM

- విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం

- 69 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం

ఖైరతాబాద్, జూన్ 6: ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలు హైదరాబాద్‌లో అత్యం త వైభవంగా నిర్వహిస్తారు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వినాయక చవితికి మూడు నెలల ముందుగానే ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులు కర్ర పూజతో ప్రారంభమవుతాయి.

శుక్రవారం ఈ కర్ర పూజను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ విగ్రహం 69 అడుగుల ఎత్తులో ఉండనుంది.

గత ఏడాది 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. విగ్రహ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ప్రారంభమయ్యాయి.

స్వాతంత్య్ర ఉద్యమకారుడు బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో ఐక్యతకు చిహ్నంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత పర్యావరణ కారణాల వల్ల కొంత ఎత్తును తగ్గించారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లను చూసుకుంటున్నారు.