హేమాచలుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి
21-03-2026 04:28 PM
మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామిని శనివారం ములుగు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ కోర్టు జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళ తమ బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్.మహేష్ , ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారికి జడ్జి శ్రీమతి సూర్య చంద్రకళ గోత్రనామాలతో అర్చన చేసి, స్వామి వారి విశిష్టత వివరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందించి ఆశ్వీరవచనం చేశారు.




