04-06-2025 01:24:41 AM
వెంకటేశ్, రానానాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’కు సీక్వెల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ‘రానా నాయుడు సీజన్2’గా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్‌వర్మ, అభయ్‌చోప్రా దర్శకత్వంలో సుందర్ అరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించారు.
ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 13 నుంచి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సీజన్2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీజన్ 1కు మించిన వినోదం, థ్రిల్‌ను ఈ సీజన్2 పంచనుందని, యాక్షన్ డ్రామాగా ఆకట్టుకోనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అర్జున్ రాంపాల్, కృతి కర్బంద, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, డినోమోరియా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు.