04-06-2025 01:23:43 AM
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా రూపొందుతున్న క్రేజీ మూవీకి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమా టైటిల్‌తోపాటు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. సముద్రపు ఒడ్డున కిరణ్ అబ్బవరం శ్రీగౌరిప్రియ జంట ఫస్ట్‌లవ్, బెస్ట్ లవ్ గురించి మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది.
సాయిరాజేశ్ కథను అందిస్తున్న ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సాయిరాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వాస్ డేనియల్; సంగీతం: మణిశర్మ; పాటలు: అనంత్ శ్రీరామ్; ఆర్ట్: భాస్కర్ ముదావత్; ఎడిటర్: సంతోష్ నాయుడు.