క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్
పెనాల్టీ షూటౌట్‌లో కొలంబియా ఔట్
వాంకోవర్, జూలై 8 : సాకర్ ప్రపంచకప్‌లో చివరి క్వార్టర్ ఫైనల్ బెర్తును స్విట్జ ర్లాండ్ దక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 4 స్కోరుతో కొ లంబియాపై విజయం సాధించింది. ఆరంభం నుంచీ ఈ మ్యాచ్ హోరాహోరీగా సా గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. అదనపు సమయంలో నూ ఫలితం తేలలేదు. ఎక్స్‌ట్రా టైమ్‌లో మాత్రం కొలంబియా ఆధిపత్యం కనబరిచి నా వారి గోల్ ప్రయత్నాలను స్విట్జర్లాండ్ స మర్థంగా అడ్డుకోగలిగింది.
తర్వాత ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పెనాల్టీ షూటౌట్‌లోనూ ఇరు జట్లు నువ్వా నేనా అ న్నట్టు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో 3 అవకాశాలను గోల్స్‌గా మలిచాయి. అయితే హె ర్నాండెజ్ పెనాల్టీ కిక్‌ను స్విస్ గోల్ కీపర్ అ ద్భుతంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. చివర్లో స్విస్ సబ్‌స్టిట్యూట్ వర్గాస్ గోల్ కొట్టి విజయాన్ని అందించాడు.






