28 March, 2026 | 3:48 PM

బీజేపీలోకి వస్తానన్న రంజిత్‌రెడ్డి

04-05-2024 01:24 AM

అవకాశం ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరారు

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): బీజేపీలో చేరేందుకు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారని.. ఆ అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ముస్లిం, క్రైస్తవుల ఓట్లతోనే తాను ఎంపీగా గెలుస్తానని రంజిత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అంటే దేశంలో హిందువులు ఓటర్లుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మతతత్వం వారిలో పెట్టుకుని బీజేపీని నిందిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను బీజేపీ ఆదుకుంటే కాంగ్రెస్ వాడుకుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. తనతోపాటు తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రంజిత్‌రెడ్డి అవినీతిపరుడు అని తాను ఆరోపించలేదని, డిప్యూటీ సీఎం భట్టి అన్నారని గుర్తుచేశారు. రంజిత్‌రెడ్డి కుంభకోణాలే కాదు భాష కూడా మార్చుకోవాలని సూచించారు.