calender_icon.png 27 November, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంగా అభివృద్ధి పనులు

27-11-2025 12:33:06 AM

  1. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన
  2. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్చెరు/ అమీన్పూర్/ రామచంద్రాపురం, నవంబర్ 26 :పటాన్చెరు డివిజన్ పరిధిలోని కాలనీలలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడుపులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అం దుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, వెంకటేష్, మల్లేష్, సీనియర్ నాయకులు కార్య కర్తలు, పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి... 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడు తున్నామని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వడక్ ప ల్లి గ్రామ పరిధిలో రెండు కోట్ల 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంత రం బొమ్మన కుంటలో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు,

వడక్ పల్లి లో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఇంజనీరింగ్ డిఇ వెంకటరమణ, పంచాయతీరాజ్ విభాగం డి ఈ సురేష్, సీనియర్ నాయకులు మల్లేష్, పాండు, భాస్కర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రామిరెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి...

భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన..

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజి బస్టాప్ వద్ద 98 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు పనులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో రహదారులు, అంతర్గత మురికినీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్లు, నూతన పార్కుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పోరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.