14 August, 2026 | 2:58 AM

నిమ్స్ అధ్యాపకుడికి అమెరికాలో అరుదైన గౌరవం

14-08-2026 12:37 AM

పంజాగుట్ట, ఆగస్టు 13 (విజయక్రాంతి): నిమ్స్ న్యూరోసర్జరీ విభాగం అధ్యాపకులైన డాక్టర్ తిరుమల్ ఎర్రగుంటకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ ఆ ఫ్ ఫ్లోరిడా ఇండియా సెంటర్ ఆయన్ను సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్‌గా ఎంపిక చేసింది. అందుకు సంబంధించిన వివరాలను నిమ్స్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా డాక్టర్ తిరుమల్ గుర్తింపు పొందారని తెలిపింది. ఆగస్టు 9 నుంచి 16 వరకు యూ నివర్సిటీలో విద్యా అనుబంధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అందులో డాక్టర్ తిరుమ ల్ యూసీఎఫ్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, వైద్యు లు, సెంట్రల్ ఫ్లోరిడా కమ్యూనిటీ సభ్యులతో సమావేశమవుతున్నారని పేర్కొంది. సమావేశంలో బాగంగా ఆధునిక న్యూరోసర్జరీ, వై ద్య విద్య, సాంకేతికత, ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై వారి తో చర్చిస్తున్నారని తెలిపింది. భారత్-అమెరికా వైద్య సంస్థల మధ్య విద్యా, పరిశోధన సహకారాన్ని విస్తరించే అంశాలపై డాక్టర్ తిరుమల్ చర్చిస్తున్నారని తెలియజేసింది.