14 August, 2026 | 1:46 AM

తండాలో తీజ్ ఉత్సవాలు

14-08-2026 12:38 AM

కొడిమ్యాల, ఆగస్టు 13 (విజయ క్రాంతి):జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. పెళ్లి కానీ అమ్మాయిలు భక్తి శ్రద్ధలతో తొ మ్మిది రోజుల పాటు,ఒకటే పూట సప్పటి తిండి తిని,తీజ్ అమ్మవారును పూజిస్తారు.దేశంలో స మృద్ధిగా వర్షాలు పడాలని, కుటుంబ సభ్యులు బాగుండాలని, గోధుమలను గుట్ట నుంచి నల్లరేగడి మట్టిని తీసుకువచ్చి చిన్న చిన్న కంక బొంగుల బుట్టలలో ప్రొద్దున, సాయంత్రం వాటికి నీరు పోసుకుంటు పాటలు, బంజారా నృత్యాలతో తొమ్మిది రోజుల పాటు చేసి నిమజ్జనం చేయ డం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్ నాయక్, రెడ్డి నాయక్,శంకర్ నాయక్,గ్రామ ప్రజలు,మహిళలు,పిల్లలు పాల్గొన్నారు.