calender_icon.png 8 September, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూర నారాయణకు అరుదైన గౌరవం

07-09-2025 12:28:34 AM

సౌత్ ఇండియా బిజినెస్ అవార్డుకు ఎంపిక 

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): డాక్టర్ సిం ధూర నారాయణకు అరుదైన గౌరవం దక్కింది. విద్యారంగం లో అసాధారణ కృషి, సమర్థ నాయకత్వానికి గాను నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర నారాయణ సౌత్ ఇండి యా బిజినెస్ అవార్డ్స్(SIBA) 2025కు ఎంపికయ్యారు. దుబాయ్‌లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్ పి.సిం ధూర నారాయణను అవార్డుతో సత్కరించారు.

దక్షిణాది రాష్ట్రాల నుంచి వేర్వేరు రం గాల్లో రాణిస్తున్న ప్రభావశీల వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. డాక్టర్ పి. సింధూర నారాయణ నాయకత్వంలో నారాయణ విద్యా సంస్థ భారతదేశంలోనే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటిగా ఎదిగిందని నిర్వాహకులు ప్రశంసించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయో జనాల ను కాపాడటంలో ముందుం టూ విద్యారంగంలో విశ్వసనీయతకు చిరునామా గా నిలవటంలో ఆమె కృషిని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ కార్మికశాఖ మంత్రి వివేక్, సినీ తారలు శ్రియాశరణ్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పి సింధూర నారాయణ మాట్లాడుతూ.. “ఒక వ్యాపారవేత్తగా, ముందు ఉత్పత్తి తయారు చేసి దానికి మార్కెట్ వెతకడం కంటే, ఉన్న సమస్యలకు పరిష్కారాలను వెతకటం ముఖ్యం అని నేను నమ్ముతాను” అని చెప్పారు.