calender_icon.png 7 September, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీటీసీ, జడ్పిటిసి ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎంపీడీఓ

07-09-2025 12:28:59 AM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని 14 ఎంపీటీసిల, జెడ్ పీటీసికి  సంబందించిన 36 గ్రామపంచాయతీల ఓటర్ లిస్ట్, 82 పోలింగ్  స్టేషన్స్  లిస్ట్ ను ముసాయిదా జాబితా  శనివారం  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మల్లీశ్వరి ప్రదర్శించారు. మండలంలో 42,068 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 20,677 మంది మహిళలు 21,391 మంది ఉన్నారన్నారు. 6 నుంచి 8 వరకు ఓటర్ లిస్ట్, పోలింగ్  స్టేషన్స్  మీద అభ్యంతరాలు  స్వికరిస్తామన్నారు. 8న ఉదయం 11:30 నిముషాలకు టేకులపల్లి మండలంలోని అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో ముసాయిదా ఓటర్ లిస్ట్  పోలింగ్  స్టేషన్స్  జాబితా మీద ఎంపీపీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని అందరు హాజరవ్వాలని కోరారు.