07-09-2025 12:26:53 AM
-విధి నిర్వహణలో 15 వేల మంది శానిటేషన్ సిబ్బంది
-హైదరాబాద్‌లో ప్రశాంతంగా నిమజ్జనం
-303 కిలోమీటర్ల మార్గంలో శోభాయాత్రలు
-జీహెచ్‌ఎంసీ పరిధిలో 2.32 లక్షల ప్రతిమల నిమజ్జనం
-వేలమందితో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర
-ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జననాన్ని పర్యవేక్షించిన సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా ముగిసింది. జీహెఎంసీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. పోలీస్, రెవె న్యూ, విద్యుత్, జలమండలి, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా, వైద్య ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖలతో జీహెచ్‌ఎంసీ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ నిరంతరం పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని 6 జోన్ల పరిధిలో జోనల్ కమిషనర్‌లు, 30 సర్కిళ్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ విభాగాల ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో నిమజ్జనం సజావుగా జరిగేలా చూసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యా ప్తంగా దాదాపు 2 లక్షల 32 వేల 520 గణే ష్ ప్రతిమల నిమజ్జనం చేశారు. కాగా పది రోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణేశుడు శనివారం మధ్యాహ్నం గంగ మ్మ ఒడికి చేరుకున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర రాజ్ దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లుఓవర్ మీదు గా మధ్యా హ్నం ఎన్టీఆర్ మార్గ్‌లోని బాహుబలి క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అనంతరం క్రేన్ నెంబర్ 4 వద్ద ని మజ్జన కార్యక్ర మం ముగిసింది.
సురక్షిత నిమజ్జనానికి ప్రాధాన్యత
భక్తుల సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ గణనీయమైన ఏర్పా ట్లు చేసింది. నగరంలోని 20 ప్రధా న సరస్సులతో పాటు, జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం సాగింది. స్థానికంగానే ఈ కొలనులు ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భక్తులు సులభంగా నిమజ్జనాలు పూర్తి చేసుకున్నారు. 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్ల ద్వారా గణేష్ విగ్రహాల నిమజ్జనాలు వేగంగా జరిగాయి. ట్యాంక్‌బండ్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా, పర్యాటక శాఖల సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్ల ను, డీఅర్‌ఎఫ్ టీంలను, 200 మం ది గజ ఈతగాళ్లను సిద్ధం గా ఉం చారు. పో లీసు సహకారంతో 13 కంట్రో ల్ రూమ్‌లు ఏర్పా టు చేశారు. గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తుల సౌక్యర్థం 39 మొబై ల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచారు.
303 కిలోమీటర్లమార్గంలో ఊరేగింపు
303.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగింది. ఈ మా ర్గంలో జీహెచ్‌ఎంసీ రోడ్ల మరమ్మత్తులను పూర్తి చేసి, శోభాయాత్రకు అనువుగా తీర్చిదిద్దింది. విద్యుత్ శాఖ కేబుల్ వైర్లను సరిచేయగా, చెట్ల కొమ్మలను తొలగించి మార్గాన్ని సుగమం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు మూ డు షిఫ్టులలో పనిచేశారు. ఊరేగింపు సమయంలో పడే పూలు, కాగితపు ముక్కలను, ఇతర వ్యర్థాలను సేకరించి జవహర్ నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు.
ఐదు వేల మంది భక్తులకు ఉచిత భోజనం
నిమజ్జనం సందర్భంగా 5,000 మంది భక్తులకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. పీపుల్స్ ప్లాజా, ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసి న ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 2 లక్షల 32 వేల 520 గణేష్ ప్రతిమల నిమజ్జనం చేయగా.. ఎల్‌బినగర్‌లో 34,287, చార్మినార్ ఖైరతాబాద్ శేరిలింగంపల్లి 38,136, కూకట్‌పల్లి 58,847, సికింద్రాబాద్ విగ్రహాల నిమజ్జనం చేశారు.
సామాన్యుడిలా ముఖ్యమంత్రి
గణేష్ నిమజ్జన వేడుకలను స్వయంగా పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం సామాన్యుడిలా ఎన్టీ ఆర్ మార్గ్‌కు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎటువంటి ఆర్భాటం లేకుం డా, కాన్వాయ్ లేకుండా, పరిమిత సంఖ్యలో వాహనాలతో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నా రు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుం డా క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. అక్కడే ఉన్న జీహెఎంసీ అధి కారుల తో మాట్లాడి నిమజ్జనాల ఏర్పా ట్లు, ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం జరగాల్సి ఉంది, బం దోబస్త్ వివరాలపై ఆరా తీశారు.
ముఖ్యమం త్రి అకస్మిక రాకతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. భక్తులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, సీఎంతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేసిన సీఎం, గణపతి బప్పా మోరి యా అంటూ వారితో కలిసి నినాదాలు చేశా రు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరిం చగా, విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని రేవంత్‌రెడ్డి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తి తో పనిచేయాలని సూచించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రశాంతంగా నిమజ్జనాలు: డీజీపీ జితేందర్
రాష్ర్ట వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతం గా కొనసాగాయని డీజీపీ జితేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషన రేట్ల పరిధిలో ప్రత్యేక బలగాలు విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్లు డీజీపీ తేలిపారు. నేటి వరకు నిమజ్జనాలు కొనసాగు తాయ ని, ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుండి 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు హైదరాబాద్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ సివి ఆనంద్.. గణేష్ ఉత్సవం, మిలాద్ ఉన్ నబీ, బోనాలు, దసరా నవరాత్రులు, హనుమాన్ ర్యాలీ, శ్రీరామనవమి ర్యాలీ వంటి పండుగల సందర్భంగా తొక్కిసలాటలు జరగకుం డా చేపడుతున్న చర్యల గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన
హైదరాబాద్ నగరంలో నిమజ్జన సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
విద్యుత్ కాంతులతో జిగేల్
నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊ రేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 టెంపరరీ లైటింగ్ ను జీహెఎంసీ ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు రాత్రి వేళలో కూడా సౌకర్యంగా నిమజ్జనాలు చేసుకున్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మూడు షిఫ్టులలో పని చేసేలా అంబులెన్స్‌లతో సహా 7 మెడికల్ క్యాంపులను సిద్ధంగా ఉంచి వైద్య సేవ లు అందించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ.. పోలీస్, సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేష్ ప్రతిమల ఊరేగింపు, నిమజ్జ నం సజావుగా, సాఫీగా జరిగేలా చూశామని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షించారు.
రద్దీగా మెట్రో రైళ్లు
గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. నగర వీధులన్నీ గణపతి విగ్రహాలతో, వాహనాలతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా పోలీసులు నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ మెట్రోను ఆశ్రయించారు. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో స్టేషన్లు, రైళ్లు రద్దీగా మారాయి. దసరా, సంక్రాంతి సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉండే జన సంద్రాన్ని హైదరాబాద్ మెట్రో స్టేషన్లు తలపించాయి.