12-08-2025 04:19:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న హమాలీలకు కూలి రేట్లు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ ఆధ్వర్యంలో మంగళవారం అధికారులకు వినతిపత్రం అందించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న చార్జీల కంటే 6 రూపాయలు అదనంగా చెల్లించాలని ఇతర అలవెన్స్లను మంజూరు చేయాలని వారు పేర్కొన్నారు. నిర్మల్ మార్కెట్ కమిటీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి రాజు, తదితరులు ఉన్నారు.