calender_icon.png 13 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచే విధంగా ఉపాధ్యాయులు బోధించాలి

12-08-2025 06:18:27 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచే విధంగా నిబద్ధతతో బోధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ కోడు మిత్ర పథకం కింద ఖాన్ అకాడమీ ద్వారా విద్యార్థులు కంప్యూటర్ ద్వారా విద్యను నేర్చుకునేందుకు ఉన్నత పాఠశాలకు 10 కంప్యూటర్లు మంజూరు చేశారు. కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభోత్సవం చేసిన కలెక్టర్ మాట్లాడుతూ... ఇంటర్నెట్, హెడ్ సెట్ లు ఏర్పాటు చేసి విద్యా సామర్థ్యాలు తక్కువ ఉన్న విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా మంజూరు ఆయన కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం 10వ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్  విద్యార్థులకు  చిన్న సంకలనం లెక్క ఇచ్చి పరిష్కరించమని అడిగారు.  దాదాపు 8 నిమిషాలు  వ్యవధి ఇచ్చిన ఒక్కరు సమాధానం రాయలేకపోయారు.  విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్ నిర్ఘాంతపోయారు. 10వ తరగతి విద్యార్థులు 6వ తరగతిలో ఉన్న చిన్న లెక్కను పరిష్కరించకపోవడం ఏమిటని లెక్కల మాస్టారును ప్రశ్నించారు.  పద్ధతులు మార్చుకోవాలని, విద్యార్థులకు అంకిత భావంతో పాఠాలు బోధించాలని చెప్పారు. మళ్ళీ నెల రోజులకు వస్తానని ఎప్పటిలోగా లెక్కలలో విద్యార్థులు అభ్యసన సామర్థ్యం పెంచాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆత్మకూరు తహసిల్దార్ చాంద్ పాషా, సి.యం. ఒ మహానంది, మండల విద్యా అధికారి, ప్రధానోపాధ్యాయుడు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.