calender_icon.png 13 August, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఇస్తానన్న ఆరు పథకాలు అమలు చేయాలి

12-08-2025 06:34:48 PM

బిజెపి మండల మాజీ అధ్యక్షులు పల్నాటి సతీష్..

మంగపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే విషయంలో విఫలం అయ్యారని భారతీయ జనత పార్టీ మండల మాజీ అధ్యక్షులు పల్నాటి సతీష్ అన్నారు మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు అంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది అని ఏద్దేవా చేశారు. మొన్నటికి మొన్న ఢిల్లీ పర్యటన నుండి వచ్చిక బీసీ రిజర్వేషన్ బీజేపీ మీద నిందా వేయడం సరైన విధానం కాదు అమలుకు సాధ్యం కానీ వాగ్దానాలు గ్యారంటీలు ఇవ్వడం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే బడ్జెట్ సరిపోవడం లేదు మిగులు జలాలు ఉన్నా తెలంగాణను అప్పుల పాలు చేసిండు అని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీదకు నెట్టడం యువతకి మిరిస్తానన్నా రాజీవ్ యువ వికాసం ఎటుపోయే మహిళా భరోసా నెలకు 2500అమలు కాలేదు వృద్దుల భరోసా పెంచలేదు.

ఇందిరమ్మ ఇండ్లు సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ఉచిత విద్యుత్ వల్లనా రైతుల పరిస్థితి గోరంగా ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోకి వెళితే ప్రజలు కాంగ్రెస్ నాయకులని నిలధిస్తారని డిపాజిట్లు రావు అని ఇప్పుడు రిజర్వేషన్ ల మీద సాకు చూపించి స్థానిక ఎన్నికల అపుతున్నారు మండలంలో గ్రామ పంచాయతీ లలో ఎన్నికలు జరుగక ప్రత్యేక అధికారుల చేతుల్లో అభివృద్ధి నోచుకోలేక ప్రతి గ్రామం అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉంది.ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేసి తొందరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పల్నాటి సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.