12-08-2025 04:03:50 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కోర్టు ఆవరణానికి వచ్చిన నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జరిగింది. వివరాలలోకి వెళ్తే... నల్లగొండ పట్టణం బిటిఎస్ ప్రాంతానికి చెందిన గారాల శివకుమార్ యాదమ్మ సహకారంతో ఆమె కూతురును బలవంతంగా పెండ్లి చేసుకుని అత్యాచారానికి ప్రయత్నించగా బాలిక తిరస్కరించింది. అంతేకాక బలవంతంగా ఆ బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీశాడు.
ఇదే సందర్భంలో శారీరకంగా బలవంతంగా అనుభవించాడు. శివకుమార్ కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ బాధ్యత బాలిక 2023 మే 8న ఆమె తల్లి యాదమ్మ, శివకుమార్ పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టు తుది తీర్పు వెలువడుతున్న సమయంలో నిందితులు శివకుమార్, యాదమ్మ కోర్టుకు వచ్చారు. కాసేపట్లో శిక్ష వెలువడే సమయంలో భయం జొరబడి వాష్ రూమ్ పేరుతో గ్యారాల శివకుమార్ కోర్టు నుండి వెళ్లిపోయారు.