22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

నేడు యాదగిరిగుట్టలో రథసప్తమి వేడుకలు

04-02-2025 12:00 AM

బంగారు రథంపై స్వామి వారి ఊరేగింపు

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి)  ః యాదగిరిగుట్టలో  స్వయంభూనిగా వెలసి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నేడు రథసప్తమి  వేడుకలు  ఘనంగా జరుపుతున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం 8 గంటలకు ఆలయ తిరుమాడ వీధులలో రంగ రంగ వైభవంగా ఊరేగింపు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం, రథసప్తమి విశిష్టత భక్తులకు విసిదీకరించబడుతుందని  వివరించారు.

రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి వారు బంగారు రథం పై ఆలయ అంత ప్రాకారంలో ఊరేగింపబడును. రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయం నందు భక్తులచే జరుపబడు సువర్ణ పుష్పార్చన కార్యక్రమం రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు.