calender_icon.png 2 August, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు

30-07-2025 12:34:08 AM

  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ 

పటాన్ చెరు, జులై 29 : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.  కొత్త రేషన్ కార్డుల పంపిణీ  నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.  మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన రేషన్ కార్డులు అందజే శారు. 

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రతినెల రేషన్ దుకాణాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. డబ్బుల కోసం రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు. అలా విక్రయిస్తే శాశ్వత ప్రాతిపదికన రేషన్ కార్డులు రద్దు చేస్తామని హెచ్చరిం చారు.

మొదటి విడతలో  నియోజకవర్గ వ్యాప్తంగా 2096 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందించామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల  అధికారి స్వరూప, నియో జకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్,  మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతికి పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే.. 

పటాన్ చెరు పట్టణానికి చెందిన సీసాల రాజు ప్రతి ఏటా నిర్వహించే తిరుపతి పాదయాత్రను ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం  జెండా ఊపి ప్రారంభించారు. పటాన్ చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.  21 సంవత్సరాలుగా తిరుపతి వరకు పాదయాత్ర చేయ డం అభినందనీయమన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయవంతం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.