calender_icon.png 2 August, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూరాలకు పెరుగుతున్న వరద

02-08-2025 12:23:39 PM

గద్వాల్: ఎగువ కర్ణాటక నుంచి జూరాల జలాశయానికి వరద ప్రవాహం రోజురోజుకీ పెరుగుతున్నది. ప్రస్తుతం జూరాల దగ్గర 21 గేట్లు ఎత్తి దిగువకు 2,21,535 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుండి 2.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు .ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు దగ్గర నీటి నిల్వ 7.785 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు