02-08-2025 12:30:55 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ (Sirpur Paper Mills Limited) యాజమాన్యం ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధి కింద మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఈనెల 13న ప్రారంభిస్తున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటన తెలిపారు. ఈ శిక్షణ నిపుణులతో 45 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌లోని (సింగానియా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ , SPM కన్జ్యూమర్ స్టోర్) ప్రాంగణంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పోస్టర్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.మరిన్ని వివరాలకు 9866257509 - సుశీల 8374727709 - శివకుమార్ సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమాన్ని స్పర్శ్ సోషల్ ఫౌండేషన్ ద్వారా అమలు చేస్తుందని జె.కె. పేపర్ లిమిటెడ్ & సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.