02-08-2025 12:26:38 PM
హై వోల్టేజ్ విద్యుత్ సరఫరాతో విజ్ఞాన్ స్కూల్‌లో భారీ ఆస్తి నష్టం
ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్‌లో హై వోల్టేజ్ విద్యుత్(High voltage power supply) సరఫరా కారణంగా లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ సరఫరాలో సంభవించిన తీవ్రమైన హెచ్చు ఒత్తిడితో స్కూల్‌లో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి.స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం, క్లాస్‌రూమ్‌లో ఉపయోగిస్తున్న 65 ఇంచుల ఎల్‌ఇడి టచ్ స్క్రీన్ టీవీ (ధర సుమారు రూ. 2,70,000), అలాగే బోర్ మోటార్ స్టార్టర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ హాని మొత్తం సుమారు రూ. 3 లక్షలుగా అంచనా వేయబడుతోంది.ప్రాంత వాసులు, స్కూల్ యాజమాన్యం గతంలోనే సెస్ అధికారులకు పలుమార్లు కంప్లైంట్‌లు ఇచ్చినా,ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలు తరచుగా ఎదురవుతున్నప్పటికీ అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారని వాపోతున్నారు.