calender_icon.png 2 August, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో నిత్యాన్నదానం

02-08-2025 12:33:37 PM

వెంకటేశ్వర స్వామి దేవాలయ అన్నదాన భవన నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని సుప్రసిద్ధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో(Sri Venkateswara Swamy Temple) జరుగుతున్న శ్రావణ మాస పవిత్ర ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న అన్నదాన సత్ర నిర్మాణ పనులను పరిశీలించారు. స్వామి వారి సేవలో భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించేల చూడాలన్నారు. భవన నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా భవనంకు అవసరమగు గ్రానెట్ ను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. భవనం అద్భుతంగా నిర్మాణం చెపట్టాలని సూచించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిభిరరాన్ని ప్రారంభించారు. స్వామి వారిని దర్శించుకున్నకా ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు.

సంతోషి మాత ఆలయ అభివృద్ధి కి కృషి

శ్రావణ మాసం సందర్బంగా సిద్దిపేట పట్టణంలోని శ్రీ సంతోషి మాత దేవాలయ వార్షికోత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) పాల్గొనీ, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా జరిగిన పూర్ణహుతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రావణ మాసం శ్రీ సంతోషి మాత అమ్మవారికి ప్రత్యేక మాసమన్నారు. ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో పాటు పవిత్రతో అమ్మవారిని కొలుస్తారన్నారనీ, ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్థామని చెప్పారు. ఈ సందర్బంగా అర్చకులు ఆశీర్వచనం చేశారు.