02-08-2025 12:28:46 PM
మంథని, (విజయక్రాంతి): సీరియల్ లో ఉన్న లారీలను కాదని ముత్తారం నుంచి అక్రమంగా వస్తున్న కంపెనీ లారీల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ఇసుక క్వారీ వద్ద లారీ డ్రైవర్ లు ఆందోళన చేస్తున్నారు. తాము వారం రోజులుగా ఇల్లు వదిలి లారీలలో జీవిస్తున్నామని, ఇసుక కోసం ప్రభుత్వానికి డీడీ తీసి సీరియల్ గా లారీలు పెట్టుకొని తాము ఉంటే, ఇసుక క్వారీ యాజమాని తమ లారీలను కంపెనీ లారీల పేరుతో అక్రమంగా తమకు ఇసుకపోయకుండా పంపిస్తున్నాడని వారు ఆరోపించారు.
లారీకి 3 నుండి 4 వేలు ఇస్తేనే లోడ్ చేస్తాం అంటున్నారు
ఒక్కో లారీకి ఇసుక క్వారీ వారు మూడు నుంచి నాలుగు వేలు ఇస్తేనే లారీ లోడ్ చేస్తున్నారని స్వయంగా లారీ డ్రైవర్లే ఆరోపిస్తున్నారు. 100 లారీలు లోడ్ చేస్తే దాదాపు ఒకరోజు మూడు లక్షల అక్రమంగా వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం ఇసుక కార్యాలపై నిఘా పెట్టి పాలసి ప్రకారం రూపాయి కూడా ఇవ్వద్దని చెప్తుంటే, ఇక్కడ క్వారీ యాజమాన్యం మాత్రం డబ్బులు ఇస్తేనే లోడ్ చేస్తున్నారని ఆరోపించారు. కంపెనీ పేరుతో క్వారీ యాజమాన్యం ఇసుకను అక్రమంగా తరలిస్తుటే టీఎస్ఎండిసి, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైన వందల కొద్ది లారీలు పెట్టుకొని తాము ఇబ్బందులు పడుతున్నామని, అలాగే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.