రేషన్ బియ్యం పట్టివేత
27-03-2026 12:00 AM
బెజ్జూర్, మార్చి ౨౬ (విజయక్రాంతి): చింతలమానేపల్లి నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల పీడీఎస్ సన్న బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం అర్థరాత్రి పట్టుకున్నారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు రాజ్‌కుమార్, శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎంహెచ్ 33 టి 4765 వాహనంలో (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రలోని అహేరి ప్రాంతానికి చెందిన నేహాల్ షేక్ అనే వ్యక్తి తరలిస్తుండగా చింతల మానేపల్లి మండల కేంద్రం వద్ద సుమారు 30 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. స్థానిక దళారుల సహాయంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు నేహాల్ షేక్, మరో ఐదుగురు నిందితులపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.




