27 March, 2026 | 1:44 AM

శ్రీరామనామి భక్తితో జరుపుకోవాలి

27-03-2026 12:00 AM

భైంసా, మార్చి ౨౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నేడు జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో భైంసా సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, రవీందర్, సాయికుమార్, ఎస్.ఐలు ఉన్నారు.