calender_icon.png 26 July, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల హాస్టల్‌లో విద్యార్థులను కొరికిన ఎలుకలు

26-07-2025 12:12:41 AM

హుజూరాబాద్‌లో బీసీ బాలుర హాస్టల్‌ ఘటన

హుజూరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ మండలంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల హాస్టల్‌లో విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. బోర్నపల్లి గ్రామ శివారులో ఉన్న ఈ హాస్టల్‌లో బుధవారం రాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికినట్లు తెలిసింది.ఈ దాడిలో 8వ తరగతి విద్యార్థులు యశ్వంత్, సాయిచరణ్, కౌశిక్, అక్షిత్, శృజన్‌ సహా 9వ తరగతి విద్యార్థి రక్షిత్‌కు గాయాలయ్యాయి. మరో ఇద్దరికి కూడా ఎలుకలు కొరికినట్లు అనుమానిస్తున్నారు.

విషయాన్ని శుక్రవారం ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే విద్యార్థులను హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి టీకాలు వేయించారు.హాస్టల్ చుట్టూ రైస్ మిల్లులు, చెట్ల పొదలు అధికంగా ఉండటంతో దోమలు, ఎలుకల సంచారం ఎక్కువగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ రాణి మాట్లాడుతూ, ప్రమాదం ఏమీ లేదని, బాధిత విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం హాస్టల్ పరిసరాల్లో ఎలుకల బోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.