calender_icon.png 26 July, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ గొప్ప వరం

26-07-2025 01:39:03 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం లో శుభమస్తు ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు, పేదల పెన్నిధి మందుల సామేలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. గతంలో కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉండి, మరి కొంతమంది పేర్లు నమోదు కాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు.

నేడు మండలంలో సుమారు 1400 కార్డులతో ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరగడం, శుభ పరిణామం అని అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, మార్కెట్ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి, జిల్లా నాయకులు సుంకర జనార్ధన్, కందుకూరు లక్ష్మయ్య, రెవెన్యూ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.