26-07-2025 01:45:36 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): వేములవాడశ్రీ రాజరాజేశ్వరి కన్వెన్షన్ హాల్ లో మున్నూరు కాపు సంఘం(Munnurukapu Sangam) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మగౌరవ తొలి కార్యచరణ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం మున్నుకాపు సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గాజుల మహేందర్ మున్నూరుకాపు సంఘం రెండవసారి రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం, నియామక పత్రం అందచేసారు.
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన , కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పటేల్,శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కనకయ్య, విట్టల్, వి. ప్రకాష్, మీసాల చంద్రయ్య, సుంకరీ బాలకిషన్ సహా ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు, తమ కులానికి సేవ చేసే అదృష్టం కల్పించినందుకు మరింత బాధ్యత పెరిగిందని, తమ వంతు సహాయ సహకారాలు కులానికి అందిస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దీనితో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం సభ్యులు, స్నేహితులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు