26-07-2025 01:30:35 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ(Bharat Rashtra Samithi Student Wing) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ మల్లాపూర్ లోని ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla Project) వల్ల కలిగే నష్టంపై బీఆర్ఎస్పీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక మార్గదర్శకాలు చేశారు.
కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) గోదవరి, కృష్ణా నీళ్లను కాపడే ప్రయత్నం చేశారని ఆయన వివరించారు. 90 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ యువతకు వచ్చేలా చేశామని చెప్పారు. నీళ్లు ఏపీకీ, నిధులు ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. మన హక్కులు దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు.. వాటిని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఏనాడు జైతెలంగాణ అనలేదు.. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని హరీశ్ రావు వివరించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందిరైనా ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి తెలిపారు.