26-07-2025 01:32:56 PM
వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలోని ఎస్.డి.యం న్యాయ కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు జడ్జి(Telangana High Court Judge) జస్టిస్ టి. మాధవి దేవి - పూల మొక్కతో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.శనివారం వనపర్తి జిల్లాలో ఉన్న ఎస్.డి.యం. న్యాయ కళాశాల వార్షిక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుండగా ఈ వేడుకలకు తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వనపర్తి జిల్లాకు విచ్చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైకోర్టు జడ్జిని ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్వాగతం పలికారు.వనపర్తి జిల్లా న్యాయస్థానం నుండి సీనియర్ సివిల్ జడ్జి కమ్ సెక్రెటరీ వి. రజనీ,ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. కళార్చన,అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, ఆర్డీఓ సుబ్రమణ్యం సైతం స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.