calender_icon.png 26 July, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధ విమాన పైలట్ జంటకు సుప్రీం కీలక సూచన

26-07-2025 02:25:02 PM

న్యూఢిల్లీ: ఒకరినొకరు క్షమించుకుని ముందుకు సాగండని 2019 బాలకోట్ దాడిలో పాల్గొన్న ఒక యుద్ధ విమాన పైలట్(Fighter pilot) వివాహ వివాదంలో చిక్కుకున్న అతని భార్యకు సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ పిఎస్ నరసింహ(Justice Pamidighantam Narasimha), అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం దంపతుల మధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని యుద్ధ విమాన పైలట్ ఆరోపించారు. అమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పైలట్ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించాడు. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. "మీరు ఒకరినొకరు క్షమించుకుని, మరచిపోయి ముందుకు సాగండి" అని బెంచ్ పేర్కొంది. తన భార్య, ఐఐఎం గ్రాడ్యుయేట్ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని వైమానిక దళ అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసు జారీ చేసింది. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలన్న తన విజ్ఞప్తిని పంజాబ్, హర్యానా హైకోర్టు తిరస్కరించిన తర్వాత ఫైటర్ పైలట్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.