calender_icon.png 26 July, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు చట్టాల గురించి తెలుసుకోవాలి

26-07-2025 12:13:25 AM

లీఫ్ సంస్థ చైర్మన్ భూమి సునీల్

చేవెళ్ల, జులై 25:రైతులు చట్టాల గురించి తెలుసుకోవాలని లీఫ్స్ సంస్థ చైర్మన్ భూమి సునీల్ పిలుపునిచ్చారు. శుక్రవారం మొయినాబాద్ , చేవెళ్ల మున్సిపాలిటీల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన రైతు సాగు యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, భూదాన్ మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికోసమైతే చట్టాలు చేస్తున్నామో వారికి అవగాహన కల్పించించేందుకు ఈ యాత్ర చేపట్టానన్నారు.

ప్రతి రైతుకు భూభారతితో పాటు ఇతర రైతు చట్టాల గురించి తెలిసి ఉన్నప్పుడే సరైన న్యాయం పొందగలమన్నారు. భూభారతి చట్టం 18 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వం ఆధార్ లాగా త్వరలోనే భూధార్ కార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మొయినాబాద్ మండలం షాపూర్ గ్రామంలో పంటలను పరిశీలించి, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, చేవెళ్ల, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బండారి ఆగిరెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, బేగరి రాములు, తహసీల్దార్ కృష్ణయ్య, వ్యవసాయ అధికారులుపాల్గొన్నారు.