calender_icon.png 26 July, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

26-07-2025 01:42:14 PM

  1. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్:
  2. సిపిఎం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి

చండూరు, (మర్రిగూడ), (విజయక్రాంతి): దేశంలో బిజెపి(Bharatiya Janata Party ) అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ సోషలిజం సెక్యులరిజం స్ఫూర్తితో వచ్చిన భారత రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని కుట్ర చేస్తుందని ఇది దేశ ప్రజలకు నష్టమని ప్రజలను విచ్చిన్నం చేసే మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు పోరాడాలని సిపిఎం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్(CPM Social Media State Convener) పిట్టల రవి పిలుపునిచ్చారు. మర్రిగూడ మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా రెండో క్లాసు మతం- మతోన్మాదం- ప్రతిఘటన అనే అంశంపై కార్యకర్తలకు క్లాస్ బోధించారు. ఈ సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం అధ్యక్షత వహించారు. దేశంలో కార్పొరేట్ శక్తులతో స్నేహం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల మీద ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా దాడి చేస్తుందని తన దోపిడీ  ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం మతాన్ని రాజకీయ కోసం వాడుకొని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తుందని ఆరోపించారు.

ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎలక్షన్, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే భాష పేరుతో భారత ప్రజలపై ఆర్ఎస్ఎస్ తమ సిద్ధాంతాన్ని రుద్దడం ద్వారా ఈ దేశాన్ని మత రాజ్యాంగ చేయాలని కలలుగంటుందని అన్నారు. భారతదేశ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుంటారని లౌకికవాదానికి కేంద్రంగా ఇండియా ఉంది అని బిజెపి మతోన్మాద చర్యల్లో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేకమంది సిపిఎం కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని సమ సమాజం స్థాపన కోసం పార్టీ పనిచేస్తుందని అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ క్లాస్ కు ప్రిన్సిపల్ గా నాంపల్లి చంద్రమౌళి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున,సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, నాంపల్లి చంద్రమౌళి, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య,మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, దామెర లక్ష్మి,ఎఫ్ ఎస్ సి ఎస్ డైరెక్టర్ వచ్చిన శ్రీనివాస్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, వేముల లింగస్వామి, యాసరాణి శ్రీను, నీలకంఠం రాములు, వల్లూరి శ్రీశైలం, రామలింగా చారి, కొమ్ము లక్ష్మయ్య, ఈరటి వెంకటయ్య, టేకుమెట్ల కృష్ణ, పడసబోయిన యాదగిరి, బొమ్మరగో ని నరసింహా, బండారు కృష్ణయ్య, రాఘవేంద్ర, కొట్టం యాదయ్య, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.