7 July, 2026 | 12:21 PM

ఆర్బీఐ రేట్ల కోతలో జాప్యం

16-05-2024 12:06 AM

ఇండియా రేటింగ్స్ అంచనా

న్యూఢిల్లీ, మే 15: రిజర్వ్‌బ్యాంక్ పాలసీ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో జరగదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఆర్బీఐ రెపో రేట్ల కోత పట్ల ఆశాభావం సన్నగిల్లడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నదని ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ సౌమ్యాజిత్ నియోగి చెప్పారు. తాజాగా బ్యాంకింగ్ దిగ్గజం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. తదుపరి రుణ రేట్లు కూడా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. రిటైర్‌మెంట్ ఫండ్స్, బీమా సంస్థలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల నుంచి బాండ్లకు మంచి డిమాండ్ ఉన్నందున, బాండ్ ఈల్డ్స్ తక్కువస్థాయిలో కొనసాగేలా ఆర్బీఐ చూస్తుందని నియోగి వివరించారు. ప్రభుత్వ ఆర్థిక సంస్థల బాండ్ల జారీ ఊపందుకుంటున్నదని, మరోవైపు ఈక్విటీ మార్కెట్ గరిష్ఠస్థాయిలో ఉన్నందున కార్పొరేట్ల నుంచి రుణాలకు డిమాండ్ పరిమితంగా ఉన్నదని ఇండియారేటింగ్స్ డైరెక్టర్ వివరించారు.