ఆర్బీఐ రూల్ మార్పు..రిటైల్ ఎఫ్‌డీ పరిమితి పెంచిన బ్యాంక్‌లు
న్యూఢిల్లీ, జూన్ 12: ఈ నెల తొలివారంలో జరిగిన రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిర్వచనాన్ని మార్చిన సంగతి తెలిసిందే. రూ.3 కోట్లు..ఆపైన మొత్తానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లనే ఇకనుంచి బల్క్ డిపాజిట్లుగా పరిగణించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకూ ఆ పరిమితి రూ.2 కోట్లు..ఆపైబడినవాటిని బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తున్నారు. అయితే ఆర్బీఐ రూల్ మార్పుతో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు మినహా), స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు తీసుకునే రూ.2 కోట్లు కోట్ల మధ్య డిపాజిట్‌ను ఇక నుంచి రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌గానే వర్గీకరిస్తారు. రిటైల్ డిపాజిట్లు, బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం ఉంటుందని డిపాజిట్‌దారులు గుర్తించాలి. ఆర్బీఐ తాజాగా నిబంధన మార్చడంతో బ్యాంక్‌లు వాటి రిటైల్ డిపాజిట్ల పరిమితని రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేశాయి. తేదీని సవరించాయి. వివరాలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేటును మార్చలేదు. అయితే రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది. వడ్డీ రేటు 2024 మే 15 నుంచి అమల్లో ఉన్నది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను జూన్ 12 నుంచి సవరించింది. రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను జూన్ 12 నుంచి అమలయ్యేలా సవరించింది. రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించడంతో పాటు రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు అప్‌డేట్ చేసింది. సవరించిన రేట్లు జూన్ 8 నుంచి వర్తిస్తాయి.
యస్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించి, రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది. సవరించిన రేట్లు జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి.
డీసీబీ బ్యాంక్: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన డీసీబీ బ్యాంక్ రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది. సవరించిన రేట్లు జూన్ 7 నుంచి వర్తిస్తాయి.
ఆర్‌బీఎల్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించి, రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు అప్‌డేట్ చేసింది. సవరించిన రేట్లు జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి.






