టెన్త్ ఫలితాల్లో ఆర్‌బీవీఆర్‌ఆర్ పాఠశాల హవా
30-04-2026 12:16 AM
వంద శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): 10వ తరగతి ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్థానిక ముబారక్‌నగర్ ఆర్‌బీవీఆర్‌ఆర్ పాఠశాల, విద్యార్థులు 550 మార్కులకు పైగా 22 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 63 విద్యార్థులు, మిగతా 48 మంది విద్యార్థులు మొదటి స్థానంలో వారి ప్రతిభ కనబరిచారు. మొదటి స్థానంలో వై.శ్రేయారెడ్డి 582/ 600, ద్వితీయ స్థానంలో డి.నర్మద 579/ 600, తృతీయ స్థానంలో జి.శృష్టి రెడ్డి 574/ 600 నిలిచారు. ప్రతిభ చాటిన, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆర్‌బీవీఆర్‌ఆర్ సొసైటీ యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినం దనలు తెలియజేసింది.






